పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:08 PM
రాష్ట్రంలో త్వరలో జరి గే పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీదే విజయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రఘునా థ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా రా మకృష్ణాపూర్, మందమర్రికి చెందిన నాయకులు ఆదివారం ఆయనను ఘ నంగా శాలువాలతో సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి
మందమర్రిటౌన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో త్వరలో జరి గే పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీదే విజయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రఘునా థ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా రా మకృష్ణాపూర్, మందమర్రికి చెందిన నాయకులు ఆదివారం ఆయనను ఘ నంగా శాలువాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వారికి పదవులు లభిస్తాయనడానికి తాను ఒక నిదర్శన మని పేర్కొన్నారు. అధిష్టానం సూచన మేరకు నూతన కమిటీల ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలు గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ ఎన్నికలు జరిగినా విజయం కాంగ్రెస్ దేనని తెలిపారు. త్వరలో సీఎంను, పీసీసీ అధ్యక్షుడిని కలవనున్నట్లు తెలి పారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మంత్రి వివేక్‌వెంకట స్వామి, ఎంపీ వంశీకృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రాజు, నోముల ఉపేందర్‌గౌడ్, గుడ్లర మేష్, ఆకారం రమేష్, ఎండీ ఇసాక్,నీలం శ్రీనివాస్‌గౌడ్, ఒడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.