Share News

kumaram bheem asifabad- దివ్యాంగులకు ప్రత్యేక తరగతులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:12 PM

ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగులకు ప్రత్యేక తరగతు లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈవో యాదయ్య అన్నారు. సావర్‌ఖేడ యూపీఎస్‌, కెరమెరి ఉన్నత పాఠశాల, ఝరి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, సూల్తాన్‌గూడ పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు.

kumaram bheem asifabad- దివ్యాంగులకు ప్రత్యేక తరగతులు
కెరమెరిలో పాఠశాలను పరిశీలిస్తున్న డీఈవో యాదయ్య

కెరమెరి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగులకు ప్రత్యేక తరగతు లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈవో యాదయ్య అన్నారు. సావర్‌ఖేడ యూపీఎస్‌, కెరమెరి ఉన్నత పాఠశాల, ఝరి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, సూల్తాన్‌గూడ పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహిస్తామని తెలిపారు. వారికి రీడర్‌ అలవెన్స్‌, ఎస్కార్ట్‌ అలవెన్స్‌లు, రవాణా ఖర్చులు చెల్లిస్తామని తెలిపారు. స్వచ్‌ తెరపీ, ఫిజియోథెరపీ తదితర వసతులు పాఠశాలల్లో కల్పిస్తామని తెలిపారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో ప్రకాష్‌, ఉపాధ్యాయులు రంగయ్య, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం బడిబాటలో భాగంగా విలీన విద్యా దినోత్సవం కార్యక్రమం నిర్వహించి ఇద్దరు దివ్యాగ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదు చేయించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌ ఎంఈవో వాసాల ప్రభాకర్‌ మాట్లాడుతూ విలీన విద్యా దినోత్సవం నిర్వహించి ఇద్దరు దివ్యాగ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదు చేయించామని చెప్పారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు లభించే సౌకర్యా లు తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్‌పి సతీష్‌, స్వరూప, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి):మండలంలోని ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు విభిన్న ప్రతిభావంతులను(దివ్యాంగులను) గుర్తించడంతోపాటు వారిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎంఈవో కుడ్మేత సుధాకర్‌ మాట్లాడుతూ ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వనరుల గదిలో దివ్యాంగులను బోధించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శివచరణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బడి మానేసిన పిల్లలను వ్యవసాయ పనులకు పంపిచకుండా పాఠశాలల్లో చేర్పించాలన్నారు. దివ్యాంగులైన విద్యార్థులను స్థానిక భవిత కేంద్రంలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నటరాజ్‌, వినేష్‌, సీఆర్పీ విజయ్‌, సునీల్‌, ఐఈఆర్‌పీ తిరుమల, ఉపాధ్యాయులు రాజమల్లు, సతీష్‌ పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గోలేటి టౌన్‌ షిప్‌లో మంగళవారం ప్రొఫెసర్‌ జయ శంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ సమగ్ర విద్య మీద అవగాహన కల్పిస్తూ, అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్య అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గజ్జల లావణ్య, ప్రశాంత్‌, సౌజన్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): అంగవైకల్యం శరీరానికి కానీ మనసు కాదని ఆత్మ విశ్వాసం ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించవ్చని ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో భవిత కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఇంక్లూజీవ్‌ ఎడ్యుకేషన్‌ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇంక్లూజీవ్‌ ఎడ్యుకేషన్‌ కో ఆర్డినేటర్‌ మధుకర్‌, ఎంఈవో అంజయ్య, ఐఈఆర్‌పీ సుమన్‌, కుమార్‌, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్కపల్లి భవిత సెంటర్‌లో జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల బడిబాట కార్యక్రమంలో భాగంగా సమ్మిళి త విద్య, బాలికల విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ విద్యార్థులకు ప్రత్యేక బోధన, వివిధ రకాల అలవెన్స్‌ల గురించి వివరిం చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుజాత, భాగ్యలక్ష్మి, అశ్విని, ఐఈఆర్‌టీ సుజాత పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): దివ్యాంగ విద్యార్థులకు సమానమైన విద్యను అందిస్తామని ఐఆర్పీ సుమన్‌ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:12 PM