Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:20 PM

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశం మందిరంలో సోమవారం ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశం మందిరంలో సోమవారం ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చే కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 8వ తేదీలోగా అన్ని ప్రధాన మంత్రి శీర పాఠశాలలో నిపుణులతో కెరీర్‌ గైడెన్‌స పై కౌన్సిలింగ్‌ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలి తెలిపారు. గ్రూప్‌-1 అధికారులు, ఇతర అధికారులు తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్దమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ దిశగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు భవిష్యత్‌ను బంగారు మయంగా మలుచుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌, ఎస్‌ఓ దేవాజీ తదితరులు పాల్గొన్నారు.

మద్యం దుకాణం జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి

అదనపు కలెక్టర్‌కు మహిళలు, ఐద్వా సభ్యుల వినతి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం, నజ్రుల్‌నగర్‌ పరిధిలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణంు గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల ఆద్వర్యంలో గ్రామ మహిళలతో కలిసి కలెక్టర్‌ దీపక్‌ తివారికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, నాయకులు షాహిని, సుచిత్ర సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నజ్రుల్‌నగర్‌ గ్రామ పంచాయతీకి కేటాయించిన మద్యం దుకాణం గతంలో పెంచికలపేట మెయిన్‌ రోడ్డు సమీపంలో పంచశీలనగర్‌లో ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సారి 500 మీటర్ల ముందుకు వచ్చి ఇళ్ల మధ్యలో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా ఏరాపటు చేస్తున్నారని అన్నారు. మద్యం దుకాణం దూరంగా ఏర్పాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు సుచిత్ర, రాణా, మమత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 10:20 PM