మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:10 PM
జనవరిలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సంబంధిత నాలుగు జిల్లాల డీఎంలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జనవరిలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సంబంధిత నాలుగు జిల్లాల డీఎంలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర కు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. చెన్నూరులో 70 బస్సులను, ఆసిఫాబాద్ లో 10, బెల్లంపల్లిలో 79, శ్రీరాంపూర్‌లో 45, మందమర్రిలో 50, మంచి ర్యాలలో 117 బస్సులు మొత్తం 369 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం మేడారానికి వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి ఒక్కరు ఐక్యంగా పనిచేసి ఆర్టీసీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అ వసరమని, ఆర్టీసీ డైవ్రర్లు, కండక్టర్లు అంకిత భావంతో పనిచేయాలన్నా రు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే సంస్థ దృ ష్టికి తీసుకురావాలన్నారు. డివిజన్ మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం భవానీ ప్రసాద్, మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డీఎం శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.