విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:17 PM
ఉపాధ్యాయులు విద్యార్థు లపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని డీఈవో రమేష్ కు మార్ అన్నారు.
- డీఈవో రమేష్
చారకొండ, వెల్దండ అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయులు విద్యార్థు లపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని డీఈవో రమేష్ కు మార్ అన్నారు. మంగళవా రం మండలంలోని జూపల్లి లో ప్రాథమిక పాఠశాల, వె ల్దండ మండలంలోని అజిల పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలను ఆయన అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చారు. పాఠశాలలో పరిసరాలను పరిశీలించా రు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును పరి శీలించి ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చే యాలని అన్నారు. విద్యార్థుల సమర్థ్యాన్ని పరిశీ లించి గణితంలోని మెలకువలు నేర్పించారు. ఆయన వెంట టెస్ట్‌బుక్ మేనేజర్ నరసిం హులు, ఉపాధ్యాయులు ఉన్నారు.