ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:22 PM
వసతిగృహాలు, గురుకు లాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట/ టౌన్ జూలై 29 (ఆంధజ్యోతి) : వసతిగృహాలు, గురుకు లాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం పట్టణంలోనిఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో జిల్లా వి ద్యాశాఖాధికారి రమేష్‌తో క లిసి గురుకులాల, వసతిగృ హాల సంబంధిత అధికారులతో సమావేశం ని ర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ వసతిగృ హాలు, గురుకులాల్లో పారిశుధ్య నిర్వ హణ, విద్యార్థులకు అందించే ఆహారంపై ప్రత్యే కశ్రద్ధ వహించాలని సూచించారు. వర్షాకాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని ఈగలు, దోమలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల న్నారు. తాగునీటి సరఫరా నాణ్యతను ఎప్పటి కప్పుడు పరీశిలించాలన్నారు. గురుకులాలలో ఎమైన సమస్యలుంటే ఉన్నతాధికారులకు వెం టనే సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు వ్య క్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసు కునే ముందు చేతులు శుభ్రంగాకడుక్కోవాలని సూచించాలన్నారు. సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకులాల్లో వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహారాన్ని అందించాలని, నిల్వ ఉంచిన భోజ నం విద్యార్థులకు పెట్టవద్దని ఆదేశించారు. వి ద్యార్థుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరిగితే కఠి నంగా వ్యవహరిస్తామని ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుంద న్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
అమ్రాబాద్ : నల్లమల ప్రాంతంలో నిరుపే దల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక ఎంకే గార్డెన్స్ ఫంక్షన్ హా ల్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అమ్రా బాద్ మండలానికి చెందిన 2,373 లబ్ధిదారు లకు, పదర మండలంలోని 1123 మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే రేషన్ కార్డులను అందజే శారు. రాసిమల్ల వెంకటయ్య, రెండు మండ లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరి నారాయ ణ గౌడ్, రామలింగయ్య, యాదవ్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.