Share News

విద్య, వైద్యం కోసం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:42 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కే టాయించిందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీ కృష్ణ అన్నారు.

విద్య, వైద్యం కోసం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే
ఆసుపత్రిలో వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఉప్పునుంతల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కే టాయించిందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీ కృష్ణ అన్నారు. బుధవారం మండలం లోని సామాజిక ఆరోగ్యం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంటును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా తహసీల్దార్‌ కార్యాలయం ఆవర ణలో భవిత భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల ఆ రోగ్య బీమా ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వా నికే దక్కింద న్నారు. అంతకు ముందు వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ వాణి, వైద్యాధికారి స్వప్న, శివలీల, కాంగ్రెస్‌ నాయకులు అనంతరెడ్డి, నర్సింహారావు, భాస్కర్‌, గంగుల నరసింహారెడ్డి ఉన్నారు.

అమ్రాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

అమ్రాబాద్‌ : మండల కేంద్రంలో జరుగు తున్న రోడ్డువిస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ పం చాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. బుధ వారం ఆయన అమ్రాబాద్‌లో పనులను పరిశీ లించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పో లీస్‌ స్టేషన్‌ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవి ధంగా సంత బజారు విస్తరణ పనులకు స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశా రు. మండల కేంద్రంలోని అమరేశ్వర ఆలయం లో దుర్గామాతను దర్శించుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:42 PM