Share News

Defection Allegations of Two MLAs Concludes: మేం పార్టీ మారలేదు

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:59 AM

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, కాలె యాదయ్యల విచారణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సమక్షంలో...

Defection Allegations of Two MLAs Concludes: మేం పార్టీ మారలేదు

  • స్పీకర్‌ సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, కాలె యాదయ్యల విచారణ (స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సమక్షంలో) పూర్తయింది. నలుగురు ఎమ్మెల్యేలను విచారిస్తామని స్పీకర్‌ ప్రకటించినప్పటికీ, సమయాభావంవల్ల ఇద్దరినే విచారించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సంబంధించిన విచారణను స్పీకర్‌ 4వతేదీకి వాయిదా వేశారు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పలు ప్రశ్నలు సంధించారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరారా?, కాంగ్రెస్‌ కండువా కొప్పుకొన్నారా?, అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు సమాధానం చెబుతూ తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నామని, తమకు కప్పిన కండువా పార్టీకి సంబంధించింది కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రిని కలిశామని ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు.

Updated Date - Oct 02 , 2025 | 04:59 AM