తెలకపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:39 PM
వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలకపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
తెలకపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలకపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. సీడీ ఫైల్స్, వివిధ రికార్డ్‌లు స క్రమంగా ఉన్నాయని ఎస్‌ఐ నరేష్‌ను ప్రశం సించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటు లో ఉండాలని, ఎలాటి విషయాలున్నా ఎస్‌ఐ కి తెలియజేయాలని విలేజ్ పోలీస్ ఆఫీసర్లు గా ఉన్న కానిస్టేబుళ్లకు సూచించారు. అనం తరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నా టారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐనరేష్, సిబ్బంది పాల్గొన్నారు.