Share News

Telangana Electricity Jobs: డిస్కమ్‌ యూనిట్‌గా ఏఈ, జేఏవోల నియామకం

ABN , Publish Date - May 22 , 2025 | 07:21 AM

దక్షిణ టీజీఎస్పీడీసీఎల్‌ ఉద్యోగ నియామకాల ప్రకారం, ఏఈ, జేఏవో, జేపీవో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు డిస్కమ్‌ను యూనిట్‌గా తీసుకునే విధానం అమలు చేయనుంది. స్థానిక అభ్యర్థులుగా పరిగణించడానికి 1 నుండి 7 తరగతి వరకు ఒకే ప్రదేశంలో చదివిన వారిని ఎంపిక చేస్తారు.

Telangana Electricity Jobs: డిస్కమ్‌ యూనిట్‌గా ఏఈ, జేఏవోల నియామకం

  • దక్షిణ డిస్కమ్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి దక్షిణ టీజీఎస్పీడీసీఎల్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై భర్తీ చేయబోయే ఏఈల, జేఏవో, జేపీవో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు డిస్కమ్‌ను యూనిట్‌గా తీసుకోనున్నారు. సబ్‌ ఇంజనీర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, జూనియర్‌ లైన్‌మెన్‌, వాచ్‌మెన్‌ నియామకంలో ఆపరేషన్‌ సర్కిల్‌/జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారు. ఇక, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ఒకేచోట చదివిన వారినే స్థానిక అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. రెండు లేదా అంతకు మించిన డిస్కమ్‌ల పరిధిలోని జిల్లాల్లో ఒకటి నుంచి ఏడో తరగతి దాకా చదివిన వారిని డిస్కమ్‌ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటారు.

Updated Date - May 22 , 2025 | 07:22 AM