Share News

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్‌ అమానత్‌...

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:07 AM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆగస్టు నెలలో 125 మొబైల్‌ ఫోన్‌లు పోగొట్టుకున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయి...

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్‌ అమానత్‌...

  • 22 ఫోన్లు స్వాధీనం.. యజమానులకు 9 మొబైల్స్‌ అప్పగింత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆగస్టు నెలలో 125 మొబైల్‌ ఫోన్‌లు పోగొట్టుకున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. ‘ఆపరేషన్‌ అమానత్‌’లో భాగంగా వీటిలో 96 ఫోన్‌లను రైల్వే పోలీసులు బ్లాక్‌ చేశారు. అందులో 34 ఫోన్‌ల జాడ గుర్తించి, 22 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 9 ఫోన్‌లను యజమానులకు అప్పగించారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా అపహరణకు గురైన మొబైల్‌ ఫోన్‌లను బ్లాక్‌ చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. గత నెలలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్‌ డివిజన్లలో అపహరణకు గురైన ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్‌ చేస్తున్న ఈ కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ ప్రశంసించారు.

Updated Date - Sep 10 , 2025 | 05:07 AM