Share News

భూభారతి చట్టంతో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:19 PM

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కన్నాల రైతువేదికలో భూభారతి 225 చట్టంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

భూభారతి చట్టంతో సమస్యల పరిష్కారం
భూ సమస్యలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తున్న రైతులు

- జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

బెల్లంపల్లి, ఏప్రిల్‌25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కన్నాల రైతువేదికలో భూభారతి 225 చట్టంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. భూములపై ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి వివిధాలకు తావులేకుండా రక్షణగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టంలో రైతులు కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేకుండా ఎంఆర్‌వో, ఆర్డీవో, కలెక్టర్‌ల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. భవిష్యత్‌లో భూ పంచాయతీలు ఉండవని జూన్‌ 2 నుంచి క్షేత్ర స్థాయిలో అమలవు తుందన్నారు. తహసీల్దార్‌ చట్టంలోని ప్రతి అంశంపై అవగాహన సాధించా లన్నారు. భూభారతి చట్టం ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేస్తుందని సాదాబైనామాల సమస్యలు సైతం పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఆర్డీవో హరిక్రిష్ణ, తహసీల్దార్‌ జోష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:19 PM