Share News

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:07 PM

నస్పూర్‌ మున్సి పాలిటీలో పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న 132 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు జిల్లా మున్సిపల్‌ కాంట్రాక్‌ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతి

నస్పూర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌ మున్సి పాలిటీలో పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న 132 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు జిల్లా మున్సిపల్‌ కాంట్రాక్‌ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సం ఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ 132 మంది కార్మికులకు సంబందించి పీఎఫ్‌, ఈ ఎస్‌ఐ కొన్నే ళ్లుగా కార్మికుల ఖాతాల్లో జమ కావడంలేదన్నారు. కార్మికుల వేతనాల నుంచి కట్‌ చేసినప్పటికి వారికి ఫీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల్లో జమ చేయలేదన్నారు. 2020 నుంచి 2022 వరకు మూడేళ్లకు సంబంధించిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ము జమ కా వాలన్నారు. అంతే కాకుండా ఆరేళ్లుగా పని చేసిన 86 మంది కార్మికులను ఏప్రిల్‌లో తొలగించా రని, వారిని తిరిగి తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నస్పూర్‌ అధ్యక్షు డు కొయ్యల వెంకట్‌, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:07 PM