Share News

kumaram bheem asifabad- ఘనంగా దుర్గామాత నిమజ్జనం

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:34 PM

జిల్లాలో శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి, శారద మాతల విగ్రహాలను శుక్రవారం నిమజ్జనం చేశారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు శోభాయాత్ర నిర్వహించి పెద్దవాగులో ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా ఆయా మండపాల వారు దుర్గమాత, శారదదేవి విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు.

kumaram bheem asifabad- ఘనంగా దుర్గామాత నిమజ్జనం
ఆసిఫాబాద్‌లో శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/బెజ్జూరు/దహెగాం/జైనూర్‌ అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి, శారద మాతల విగ్రహాలను శుక్రవారం నిమజ్జనం చేశారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు శోభాయాత్ర నిర్వహించి పెద్దవాగులో ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా ఆయా మండపాల వారు దుర్గమాత, శారదదేవి విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దవాగులో నిమజ్జనం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం దుర్గాదేవి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. శరన్నావరాత్రుల సందర్భంగా ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. అనంతరం పెద్దవాగులో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు బెజ్జూరు మండలంలో దుర్గామాత నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి విగ్రహా లను ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు. దహెగాం మండలంలోని బీబ్రా, చిన్నరాస్పెల్లి, దహెగాం, గిరివెల్లి తదితర గ్రామాల్లో దుర్గాదేవి నిమజ్జన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భాజా భజంత్రీల మధ్య వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప పెద్దవాగు, ఎర్రవాగులో దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేశారు. జైనూర్‌, మండల కేంద్రంలో దుర్గామాతకు గణేశ్‌నగర్‌, శివాజీ నగర్‌, విహకిర్‌ సెక్షన్‌ కాలనీ వాసులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు డప్పుల వాయిద్యాల మధ్య ఆటల పాటలతో దుర్గామాతను సమీప చెరువులో నిమజ్జనం చేశారు.

Updated Date - Oct 03 , 2025 | 10:34 PM