Share News

ఐటీ హబ్‌ స్థలంలో మట్టి దందా...

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:31 PM

ఇండ స్ట్రియల్‌ పార్క్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలం లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నా యి. వారం పది రోజులుగా రాత్రివేళల్లో గుట్టు చప్పు డు కాకుండా తవ్వకాలు జరుపుతున్న గుర్తు తెలియ ని వ్యక్తులు పెద్ద మొత్తంలో మట్టిని లారీల ద్వారా ఇ తర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐటీ హబ్‌ స్థలంలో మట్టి దందా...
మట్టి తవ్వకాలతో ఏర్పడ్డ భారీ గుంతలు

-రాత్రివేళల్లో జేసీబీలతో తవ్వకాలు

-లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా

-శిలాఫలకం సమీపంలో ఏర్పడ్డ భారీ గుంతలు

మంచిర్యాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇండ స్ట్రియల్‌ పార్క్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలం లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నా యి. వారం పది రోజులుగా రాత్రివేళల్లో గుట్టు చప్పు డు కాకుండా తవ్వకాలు జరుపుతున్న గుర్తు తెలియ ని వ్యక్తులు పెద్ద మొత్తంలో మట్టిని లారీల ద్వారా ఇ తర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ హ బ్‌ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫ లకం సమీపంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుం డ టం గమనార్హం. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప రిధిలోని వేంపల్లి, పోశంపహాడ్‌ శివారులో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆ ధ్వర్యంలో దత్తసాయి ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టె క్నాలజీతోపాటు ఆటోనగర్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందు కు 292 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి భూ సేకరణ ద్వారా కేటాయించారు.

పరిశ్రమల ఏర్పాటు సమయంలోనే....

ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీతోపాటు ఆటో నగర్‌ పార్క్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపులు పూర్తి కావడంతో త్వరలో పరిశ్రమలు స్థాపించే వ్యాపారులకు భూములు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో పురుడు పోసుకున్న భారీ ప్రాజెక్టు ద్వా రా వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగా లు లభించనుండగా, ఇతరులకు కూడా ఉపాధి అవ కాశాలు పుష్కలంగా లభించనున్నాయి. జిల్లాలో ఇప్ప టి వరకు ఎక్కడా కూడా ఇండస్ట్రియల్‌, ఐటీ హబ్‌ పా ర్కు లేకపోగా తొలిసారిగా మంచిర్యాల నియోజక వర్గంలోనే దానికి అంకురార్పణ జరిగింది. ఇండస్ట్రియల్‌ పార్క్‌కు ఈ ఏడాది జూలై 13న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏ ర్పాటు కోసం భూములు కేటాయించేందుకు సన్నద్ధం అవుతున్న తరుణంలోనే మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి.

రాత్రి సమయంలో తవ్వకాలు....

ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కు కోసం కేటాయించిన భూ ముల్లోని సర్వే నంబర్‌లు 154, 155, 159లలో అక్ర మంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతిరోజూ రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు జేసీబీల సహాయంతో తవ్వకాలు జరుపుతూ లారీల ద్వారా పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. సదరు స్థలం జనావాసాలకు దూరంగా ఉండటం, అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండటంతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల ధృష్టి దానిపై పడటం లేదు. ప్రత్యేకంగా పని కోసం వెళ్లేవారు మినహా అటువైపుగా రాత్రి వేళ ల్లో దాదాపు ప్రజలు వెళ్లే అవకాశాలు అరుదు. పగటి పూట సైతం పశువుల కాపర్లు, పరిసరాల్లో రియల్‌ వ్య యసాయం చేసే వారు తప్ప ఇతరుల సంచారం చా లా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు పెద్ద ఎత్తున తవ్వకా లు జరుపుతుండగా, ఆ ప్రదేశంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి.

రియల్‌ వెంచర్లకు తరలింపు...

ఇండస్ట్రియల్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలంలో మెత్తటి మొరంతో కూడిన నాణ్యమైన మట్టి లభిస్తుంది. ఆ మట్టిని రోడ్ల నిర్మాణం, లోతుగా ఉన్న ప్రాంతాల్లో నింపడానికి ఉపయోగిస్తే వర్షాకాలంలోనూ బురదమయం కాకుండా ఉంటుంది. శిలాఫలకం చు ట్టూ ఉన్న ప్రాంతమంతా గతంలో బొందలు, గుంతలు గా ఉండేది. ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు సందర్భం గా స్థలాన్ని చదును చేశారు. దీంతో అక్కడికి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. దీన్ని ఆ సరగా మలుచుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు జేసీబీ యజమానులతో ఒప్పందం కుదుర్చుకొని తవ్వ కాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో లభించే మట్టి ఒక్కో లారీ ట్రిప్పు రూ. 8 వేల వరకు ధర పలుకు తోంది. అలా నిత్యం 20 నుంచి 30 లారీల్లో మట్టిని అ క్రమంగా తరలిస్తున్నారు. జేసీబీ యజమానులు, రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కారణంగా ఇండస్ట్రియల్‌ పార్కు ప్రాంతమంతా ప్రస్తుతం భారీ గుంతలు ఏర్పడగా, ప్ర భుత్వ ఖజనాకు రాయల్టీ రూపంలో పెద్ద మొత్తంలో గండి పడుతోంది. ఐటీ పార్కు కోసం వ్యాపారులకు స్థ లాలు అప్పగించాల్సి ఉన్నందున మట్టి తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడ్డ భారీ గుంతలను తిరిగి పూ డ్చాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాని కోసం పెద్ద మొత్తంలో మట్టి అవసరం కాగా, ఇతర ప్రాంతాల నుంచి తరలించాల్సి వస్తుందని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చుల కోసం వెచ్చించాల్సి ఉంటుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గ నులు, రెవెన్యూ శాఖల అఽధికారులు స్పందించి, అక్రమ మట్టి రవాణాను తక్షణమే అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:31 PM