Share News

నాబార్డు సహకారంతో సొసైటీలు మరింత బలోపేతం

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:54 AM

నాబార్డు సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 108 సొసైటీలను మరింత బలోపేతం చేస్తామని డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

 నాబార్డు సహకారంతో సొసైటీలు మరింత బలోపేతం
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌రెడ్డి

నాబార్డు సహకారంతో సొసైటీలు మరింత బలోపేతం

డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నాబార్డు సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 108 సొసైటీలను మరింత బలోపేతం చేస్తామని డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. నాబార్డు సీజీఎం ఉదయభాస్కర్‌ శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. డీసీసీబీతో పాటు సొసైటీల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ఉందని, భవిష్యత్తులో ఇదేవిధంగా సహకరించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి కొత్త నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరుతూ సీజీఎంకు వినతిపత్రం అందించారు. అనంతరం సీజీఎం ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ డీసీసీబీని సందర్శించడం ఆనందంగా ఉందని, డీసీసీబీతో పాటు సొసైటీలు అభివృద్ధి చెందడం ఎంతో సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లోనూ నాబార్డు సహకారం మరింత ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపతరెడ్డి, సీఈవో శంకర్‌రావు, నాబార్డు డీడీఎంలు, బ్యాంకు డీజీఎంలు, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 12:54 AM