సాంఘిక సంక్షేమ గురుకులం తనిఖీ
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:20 PM
అచ్చంపేట పట్టణంలోని బా లుర సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బుధవారం తనిఖీ చేశారు.
అచ్చంపేటటౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట పట్టణంలోని బా లుర సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల తో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ప్రజా ప్ర భుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. మౌ లిక వసతులు కల్పిస్తూ అత్యుత్తమమైన డైట్ మెనూను ప్రవేశపెట్టామని అన్నారు. కార్య క్రమంలో పాఠ శాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.