kumaram bheem asifabad- సోషల్ వార్
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:55 PM
పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ వార్ మొదలైంది. సామాజిక మాధ్యమ వేదికగా పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పోస్టులు, కామెంట్లు ప్రత్యక్షమవుతున్నాయి. పంచా యతీ ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో పార్టీ శ్రేణులు, అభ్యర్థుల అనుచరులు యాక్టివ్ అయ్యారు.
- ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు
బెజ్జూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ వార్ మొదలైంది. సామాజిక మాధ్యమ వేదికగా పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పోస్టులు, కామెంట్లు ప్రత్యక్షమవుతున్నాయి. పంచా యతీ ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో పార్టీ శ్రేణులు, అభ్యర్థుల అనుచరులు యాక్టివ్ అయ్యారు. పార్టీలు, అభ్యర్థుల తరపున కార్యకర్తలు, అనుచరులు రాజకీయ పోస్టులతో మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
- చర్చలకు వేదికలుగా..
పంచాయతీ ఎన్నికల వేళ వాట్సప్ గ్రూపులు రాజకీయ చర్చలకు వేదికలుగా మారుతున్నాయి. పార్టీలకు సంబంధించిన వివిధ గ్రూపులతో పాటు గ్రా మాలు, కులసంఘాలు, యువజన సంఘాల ప్లేతో ఉన్న గ్రూపుల్లో ఎక్కడ చూసినా ఎన్నికలకు సంబంధించిన చర్చలు, పోస్టులే దర్శనమిస్తున్నాయి. నామినేషన్లు వేసిన, బరిలో ఉండబోతున్న అభ్యర్థులకు అనుకూలం గా, వ్యతిరేకంగా ఎవరికి వా రు పోస్టులు పెడుతూ హీట్ పెంచుతున్నారు. పార్టీల మద్దతు ఆశించి బంగపడ్డవారు, వారి అనుచరులు పార్టీని, నేతలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
- ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా..
పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు సోష ల్ మీడియాను ఒక అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఓటర్లలో పెద్దవారితో పాటు మహిళలు, యువకులు, యువతులకు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ పోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ, యూత్ వంటి వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఉంటారు. సోషల్ మీడియాలో అనుకూల మైన పోస్టులు పెట్టడం ద్వారా ఓటర్లను కొంతమేర ప్రసన్నం చేసుకోవచ్చనే ఆలోచన అభ్యర్థుల్లో ఏర్పడుతోంది. దీనికోసం తమకు అనుకూలంగా పోస్టర్లు, కరపత్రాలు ముద్రించడం, పాటలు పాడించుకోవడం వంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. వీటిని సోషల్ మీడియా ద్వారా నేరుగా ఓటర్ల వద్దకు చేర్చవచ్చని అభిప్రాయపడుతున్నా రు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియా వేదికగా ఓ వైపు ఆయా రాజకీయ పార్టీల శ్రేణులు పోస్టులు పెడుతుండగా మరోవైపు రాజకీ యాలకు దూరంగా ఉండే కొందరు యువకులు, ఇతరులు పెడుతున్న పోస్టులు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గతాన్ని, భవిష్యత్తులో చేయబోయే మంచిని చూసి ఓటేయా లంటూ చేసే సూచనలు ఆకట్టుకుంటున్నాయి.