Kalvakuntla Kavitha: సామాజిక తెలంగాణే జాగృతి లక్ష్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:32 AM
సామాజిక తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు....
సుభా్‌షనగర్ (కరీంనగర్), నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సామాజిక తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండురోజులపాటు జాగృతి ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఆమె మాట్లాడారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని తెలిపారు. పేదవాడికి నేటికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడంలేదని ఆవేదన చెందారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నల్లచట్టాలు అమలు చేయడం వల్ల కార్మికులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారని, వారికి ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.