Share News

kumaram bheem asifabad-పల్లె అభివృద్ధిలో సర్పంచే కీలకం

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:09 PM

గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుగా గుర్తొచ్చేది సర్పంచే. అధికారి వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా ముందు ఆయనను కలవాల్సిందే. అలాంటి గొప్ప స్థానంలో ఉండాల్సిన వ్యక్తి పూర్తిగా ప్రజల సంక్షేమం కోరేవారై ఉండాలి. ప్రభుత్వ పథకాల అమలులో, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలోను ఆయన పాత్రే కీలకం. ఈ నేపథ్యంలో మంచి సర్పంచ్‌ను ఎన్నుకోవడంలో పలు మార్లు ఆలోచించుకోవాలి.

kumaram bheem asifabad-పల్లె అభివృద్ధిలో సర్పంచే కీలకం
లోగో

వాంకిడి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుగా గుర్తొచ్చేది సర్పంచే. అధికారి వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా ముందు ఆయనను కలవాల్సిందే. అలాంటి గొప్ప స్థానంలో ఉండాల్సిన వ్యక్తి పూర్తిగా ప్రజల సంక్షేమం కోరేవారై ఉండాలి. ప్రభుత్వ పథకాల అమలులో, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలోను ఆయన పాత్రే కీలకం. ఈ నేపథ్యంలో మంచి సర్పంచ్‌ను ఎన్నుకోవడంలో పలు మార్లు ఆలోచించుకోవాలి. మనం ఎన్నకునే నాయకుడు కాలనీకో సీసీ రోడ్డు, రెండు భవనాలు, మురికి కాలువలు నిర్మించగానే అభివృద్ధి జరుగదు. ప్రతి విషయంపై వారికి పట్టు ఉండాలి. సామాజికంగాను అన్ని విషయాలను తెలుసుకుంటూ అన్ని రంగాల్లోనూ తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి. చాలా చోట్ల నాయకులు పలుకుబడి ఉన్న వారికి అండగా ఉంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారని చాలా విమర్శలు ఉంటాయి. ఇలాంటి వాటిని ఎప్పటికీ మర్చిపోకుండా ప్రతీ ఒక్కరికి సరైన న్యాయం చేసేవారు ఉండాలి. ఒక్క వ్యక్తిగత విషయంలోనే కాదు ప్రభత్వ పకథకాల అమలులోనూ ఎలాంటి తేడా లేకుండా న్యాయం చేసేవారు ఉండాలి.

- జిల్లాలో 335 పంచాయతీలు..

జిల్లాలో 335 గ్రామ పంచాయతీ పరిధిలో 2,874 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు 20 మంది ఇతరులు ఉన్నారు. వీటి పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామలే అన్ని నానుడి నిజంకావాలంటే స్థానికంగా మనం ఎన్నుకునే సర్పంచ్‌ అభ్యర్థే ప్రధానం. గ్రామ ప్రజల మీద, అభివృద్దిపై దృష్టి సారించే వారిని ఎన్నుకోవడమే ప్రధానం. పార్టీలు, కుల, మత బేధాలు లేకుండా పని చేస్తారా లేదా ?అన్నదే ముఖ్యం. ఐదేళ్ల పాటు పాలించే వ్యక్తిని ఎన్నుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తేనే అభివృద్ధి జరుగదు. ఇలాంటి పనులు చేయడం వల్ల తమ స్థార్థం కోసం ఎంతో కొంత మిగులుబాటు ఉండడంకోసం చేస్తున్నారనుకోవడంలోనూ సందేహం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై గ్రామల అభివృద్ధి, సమస్యలను తీర్చేందుకు కనీస అవగాహన ఉన్నవారు ఉండాలి. ప్రతి గ్రామంలోనూ ఎదో ఒక విషయంలో గ్రామ అబివృద్ధి కోసం కృషి చేస్తున్నవారు తప్పకుండా ఉంటారు. అలాంటి వారికి ప్రజలు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేలా చూసినప్పు డే నిజమైన నాయకుడు. స్థానికంగా ఉండే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అక్కడ చదువుకుంటున్న విధ్యార్థులకు ఉన్నత విద్య చదివించేందుకు దిశా నిర్దేశం చేయించాలి. ప్రతి ఒక్కరూ చదువుకునేలా దారులు చూపించాలి. చాలా చోట్ల మేము ఇన్నేళ్లుగా రాజకీయంలో ఉన్నామంటూ మాట్లాడుతుంటారు. అలాంటి వారి మాటలను వినే ముందు ఏ రకంగా అబివృద్ది చెందాం, ఎవరు అభివృద్ది చెందారు అని ఆలోచిస్తే అర్థమవుతుంది.

- ఏళ్ల తరబడి..

ఎళ్లతరబడి పంచాయతీలతో పాటు వాటి అను బంధ గ్రామాలకు కనీస సమస్యలు తీర్చే వారు కరువయ్యారు. గెలిపించిన నాయకులు తమ ఆస్తులు పెంచుకోవడంలోనే నిమగ్నం కావడంతో ప్రజల సమస్యలను, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో చాలా చోట్ల విఫలమయ్యారు. అలాంటివి అన్నీ బేరీజు వేసుకోవాలి. గ్రామానికి తగిన న్యాయం చేస్తారా లేదా? అన్ని రకాలుగా చూడాలి. గతంలో ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించారా లేక అనుర్హులకు అందించారా, విద్య, వైద్య పరంగా ప్రజలకు ఏ విధంగా మేలు చేకూర్చారు, రహదారి, రవాణా సౌకర్యం పరంగా ఏమైనా సమస్యలు తీర్చారా లేదా, ప్రస్తుతం ఎన్నో సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి అలాంటి వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా పల్లె యువతకు విద్య పరంగా అంతగా అవగాహన ఉం డదు. అలాంటి పరిస్థితిలో ఉన్నత విద్య అందించేందుకు వారిని ముందుకు తీసుకెళ్లాలి. చదువుకునేందుకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. అందుకు ఎన్నో స్పచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజలకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా చూడాలి. కాలానుగుణంగా వ్యాధులు ప్రబలుతుంటాయి అలాంటి సమయంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించేలా చూడాలి.

- ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా..

మనం ఎన్నుకోబడుతున్న అభ్యర్థి అన్నివిధాల ప్రజలకు ఉపయోగకరమై ఉండాలని చూడాలి. డబ్బులు ఉన్న వ్యక్తులు పదవులను ఆశిస్తూ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు, మద్యం సరఫరా చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తుంటారు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ఓటును డబ్బుకు విక్రయిస్తే మనం వేసే ఓటు అమ్ముకున్నట్లే. ఆ ఓటకు విలువ ఉండదు. అందుకోసం డబ్బులకు ఆశపడద్దు, మద్యానికి బానిస కావద్దు, ప్రజలకు సేవచెసె సమర్థుడైన అభ్యర్థిని అన్వేషించి అభివృద్దికి వారధిగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి.

Updated Date - Nov 29 , 2025 | 11:09 PM