సజావుగా ధాన్యం సేకరణ
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:43 PM
ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొన సాగుతున్నాయని ఎక్సైజ్‌శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- యన్మన్‌బెట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో మంత్రి జూపల్లి
కొల్లాపూర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొన సాగుతున్నాయని ఎక్సైజ్‌శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని యన్మన్‌బెట్ల, కొల్లా పూర్ పట్టణంలోని మార్కెట్ యా ర్డులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాలను బుధవారం మం త్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కొల్లాపూర్ సింగిల్ విండో సొసైటీ సీఈవో శ్రీనివాసులు తమ పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడని కొందరు రైతు లు మంత్రి దృష్టికి తీసుకురాగా, సింగిల్‌విండో సీఈవోపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొ ల్లాపూర్ సింగిల్‌విండో సొసైటీ సీఈవోను ఆది లాబాద్‌కు బదిలీ చేయాలని అధికారులను ఆదే శించారు. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో వస తులు కల్పించాలని వ్యవసాయ శాఖ కమిషన ర్‌కు ఫోన్‌లో ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో భన్సీలాల్, తహసీల్దార్ భరత్, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, మాజీ ఎంపీపీ నిరంజన్‌రావు, మాజీ జడ్పీటీసీ హనుమంత్ నాయక్, మాజీ సర్పంచ్ పాశం నాగరాజు, సింగిల్‌విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, కొల్లాపూర్ మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు, మండల వ్యవసాయ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ ఇక్బాల్, వంగ రాజశేఖర్ గౌడ్, ఖాదర్ పాషా, కమలాకర్ రావు, బచ్చలకూర బాలరా జు, కొమ్ము వెంకటస్వామి, బోరెల్లి మహేష్ పాల్గొన్నారు.