Smart Kiosks: శంషాబాద్‌లో స్మార్ట్ కియోస్క్‌లు
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:12 AM
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి...
శంషాబాద్ రూరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో స్మార్ట్ కియో్‌స్కలు, డిజిటల్ మ్యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం స్మార్ట్ కియోస్క్, డిజిటల్ మ్యాప్స్ ప్రారంభం సందర్భంగా జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ ప్రధాన చెక్-ఇన్‌హాల్స్, బోర్డింగ్ గేట్‌లు, అరైవల్స్, బ్యాగేజ్ క్లెయిమ్ ప్రాంతాల్లో మొత్తం 10 కియోస్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రయాణికులు రియల్ టైమ్ ఫ్లైట్ అప్‌డేట్స్, 3డీ నావిగేషన్, ఎమర్జెన్సీ సహాయ సమాచారం పొందవచ్చన్నారు.