Share News

kumaram bheem asifabad- స్లాట్‌ బుకింగ్‌.. స్పాట్‌ సెల్లింగ్‌

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:10 PM

పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభిం చనుంది. కనీస మద్దతు ధర అందించడంతో పాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు క్రయవిక్రయాలు పారదర్శకం గా జరిగేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ‘కాపాస్‌ కిసాన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

kumaram bheem asifabad- స్లాట్‌ బుకింగ్‌.. స్పాట్‌ సెల్లింగ్‌
లోగో

- ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సీసీఐ

- ‘కాపాస్‌ కిసాన్‌’యాప్‌ ద్వారా బుకింగ్‌

- యాప్‌పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధి కారులకు శిక్షణ

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభిం చనుంది. కనీస మద్దతు ధర అందించడంతో పాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు క్రయవిక్రయాలు పారదర్శకం గా జరిగేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ‘కాపాస్‌ కిసాన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఇక నుం చి రైతులు ఈ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకొని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసా య, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఈ యాప్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబై ల్‌ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి పత్తి బ ుక్‌ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. పత్తి విక్రయాలు యాప్‌ ద్వారానే సాగనున్నాయి.

స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే అమ్మకం:

రైతులు ‘కాపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే పత్తి అమ్ముకో గలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్‌ బుక్‌ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్‌ ద్వారా సమాచారం అంది స్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసు కోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడు సార్లు స్లాట్‌ బుక్‌ చేసుకుని, స్లాట్‌ను రద్దు చేసుకో కుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్ర యించకపోతే ఆ రైతు పేరు బ్లాక్‌లిస్టులోకి వెళ్తుం ది. బ్లాక్‌లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోవాలంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకొవాలి.

రూ. 8,110 మద్దతు ధర..

కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కాపాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కల్పించింది. స్మార్ట్‌ఫోన్‌ లేని రైతులు ఇతరుల స్మార్ట్‌ఫోన్‌ నుంచి కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైతు పాస్‌బుక్‌ నంబరు నమోదు చేయడం ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవ చ్చు. ‘కాపాస్‌ కిసాన్‌’ యాప్‌లో రైతు పట్టాదారు పాస్‌బుక్‌ నంబరు, ఇతర వివరాలను నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయశాఖ ఇప్పటికే డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తూ పంటసాగు వివరాలు నమోదు చేస్తోంది. పంటసాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్‌ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది.

డౌన్‌లోడ్‌ ఇలా..

స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కాపాస్‌ కిసాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జెండర్‌, పుట్టిన తేది, కులం, చిరునామా, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, కౌలు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ పుస్తకం నంబ ర్‌, సర్వే నంబర్‌, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివ రాలు యాప్‌లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంఽ దించిన ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, రైతు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

స్లాట్‌ బుక్‌ తప్పనిసరి..

- ఎస్‌ చక్రవర్తి, సీసీఐ అధికారి

రైతులు తప్పనిసరిగా కాపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే పత్తిని విక్రయించుకోగలుగుతారు. స్లాట్‌ బుక్‌ చేసు కోకపోతే పత్తిని విక్రయించలేరు. కాపాస్‌ కిసాన్‌ యాప్‌పై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 10:10 PM