Share News

Anil Boyinapalli: స్కై సొల్యూషన్స్‌ సీఈవోకు గ్లోబీ అవార్డు

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:17 AM

హైదరాబాద్‌కు చెందిన అనిల్‌ బోయినపల్లి.. 2025 లీడర్‌షిప్‌ గ్లోబీ అవార్డుకు ఎంపికయ్యారు. ఐటీ రంగంలో సాధించిన విజయాలకు గాను గ్లోబీ సంస్థ ప్రతి ఏటా...

Anil Boyinapalli: స్కై సొల్యూషన్స్‌ సీఈవోకు గ్లోబీ అవార్డు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన అనిల్‌ బోయినపల్లి.. 2025 లీడర్‌షిప్‌ గ్లోబీ అవార్డుకు ఎంపికయ్యారు. ఐటీ రంగంలో సాధించిన విజయాలకు గాను గ్లోబీ సంస్థ ప్రతి ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. అనిల్‌ స్థాపించిన స్కై సొల్యూషన్స్‌ సంస్థ అమెరికాలోని వర్జీనియా కేంద్రంగా వివిధ దేశాలకు విస్తరించింది. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఆ సంస్థ సీఈవోగా అనిల్‌ సాధించిన విజయాలకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశామని గ్లోబీ సంస్థ తెలిపింది.

Updated Date - Oct 17 , 2025 | 02:17 AM