Skill Development: గురుకుల విద్యార్థులకు 3 నుంచి నైపుణ్య శిక్షణ
ABN , Publish Date - May 14 , 2025 | 06:27 AM
గురుకుల విద్యార్థులకు జూన్ 3 నుండి నైపుణ్య శిక్షణ ప్రారంభం. 36,000 మంది విద్యార్థులకు కొత్త వృత్తి విద్య కోర్సులు, కోడింగ్, ఫ్రెంచ్ భాషపై శిక్షణ.
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జూన్ 3 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో 36వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 కొత్త వృత్తి విద్య కోర్సులు మొదలు పెడుతున్నామన్నారు. 6వ తరగతి నుంచి 9 వరకు, ఇంటర్ విద్యార్థులకు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు అలుగు వర్షిణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు విద్యాసంవత్సరం నుంచి ఫ్రెంచ్ భాష నేర్పిస్తామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో 57,523 సీట్లకుగానూ 55,504 సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 20న కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సీటు వచ్చిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.