Duplicate Votes: యువతి పేరుపై వరుసగా ఆరు ఓట్లు
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:06 AM
సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. కానీ ఓ యువతి పేరుపై ఒకే ఊరు, ఒకే వార్డులో ఏకంగా ఆరు ఓట్లు ఉన్నాయి. అది కూడా ....
నారాయణపేట జిల్లా మంథన్‌గోడ్ ఓటర్ల జాబితాలో విచిత్రం
మక్తల్‌రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. కానీ ఓ యువతి పేరుపై ఒకే ఊరు, ఒకే వార్డులో ఏకంగా ఆరు ఓట్లు ఉన్నాయి. అది కూడా గ్రామ ఓటరు జాబితాలో వరుసగా ఒకే ఫొటోతో ఉన్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్‌గోడ్ గ్రామంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఓటరు జాబితాలో అయిదు చోట్ల ఆమె పేరు చిన్న చిన్న మార్పులతో ఉండగా, మరో చోట మాత్రం వేరే పేరుతో ఉంది. అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా.. అదనంగా నమోదైన ఓట్లను తొలగించే అధికారం తమకు లేదని తెలిపారు.