Kothagudem: ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:55 AM
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన ఆరుగురు మావోయిస్టులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట లొంగిపోయారు.
కొత్తగూడెం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన ఆరుగురు మావోయిస్టులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట లొంగిపోయారు. వీరిలో బస్తర్ దక్షిణ ప్రాంత ఏరియా కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్న మడకం దేవా అలియాస్ దినేశ్, పార్టీ మెంబర్ జోగా మడివి, మిలిషీయా సభ్యులు ఉన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమానికి మావోయిస్టులు ఆకర్షితులయి, జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్కును పోలీసులు అందజేశారు.