Sitarama Project: సీతారామ ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్‌కు త్వరలో దరఖాస్తు!
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:28 AM
సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర జలసంఘానికి...
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర జలసంఘానికి(సీడబ్ల్యూసీ)కి దరఖాస్తు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రాజెక్టు అధికారులు ఇటీవల నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్)కి సమర్పించారు. ప్రాజెక్టుకి ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ లభిస్తే కేంద్ర జలవనరుల శాఖ ద్వారా ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజన(పీఎంకేఎ్‌సవై) పథకం కింద నిధులు పొందే అవకాశం ఉంది. ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి సీడబ్ల్యూసీ చేసే సిఫారసులు ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర జలవనరుల శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను తరలించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడం లక్ష్యం. కాగా, ఇప్పటిదాకా రూ.11,320 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన 57శాతం పనులు పూర్తి చేశారు. ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ లభిస్తే పీఎంకేఎ్‌సవై కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకుని మిగిలిన పనులు పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.