kumaram bheem asifabad- సర్‌సిల్క్ ఆస్తులు వేలానికి సిద్ధం
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:25 PM
సర్‌సిల్క్ భూములు వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిల్లు మూత బడిన తర్వాత తమకు బకాయిలు రావాల్సి ఉందని సర్‌సిల్క్ కార్మికులు 2005లో హైకోర్టులో కేసు వేయగా, భూముల అమ్మకాలు జరిపి కార్మికులు బకాయిలు చెల్లించాలని 2008లో హైకోర్టు లిక్విడేటర్‌ను నియమించింది. ఈ ప్రక్రియలో తొలి విడతలో మిల్లు ఖాళీ స్థలాలు అమ్మకానికి పెట్టేశారు
కాగజ్‌నగర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సర్‌సిల్క్ భూములు వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిల్లు మూత బడిన తర్వాత తమకు బకాయిలు రావాల్సి ఉందని సర్‌సిల్క్ కార్మికులు 2005లో హైకోర్టులో కేసు వేయగా, భూముల అమ్మకాలు జరిపి కార్మికులు బకాయిలు చెల్లించాలని 2008లో హైకోర్టు లిక్విడేటర్‌ను నియమించింది. ఈ ప్రక్రియలో తొలి విడతలో మిల్లు ఖాళీ స్థలాలు అమ్మకానికి పెట్టేశారు. ఈ ప్రక్రియతో కార్మికులకు రావాల్సిన రూ.3 కోట్ల బకాయిలు తొలివిడతలో అందజేయగా, మిగిలిన బకాయిలు అందజేసేందుకు టెండరు ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిల్లుకు సంబంధించిన 48.23 ఎకరాలను బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17లోగా రూ.5.33కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 18న బిడ్ సబ్ మిట్ చేసిన వారికి ఈ నెల 20న నిర్వహించే వేలం పాటలో పాల్గొనేందుకు అర్హులుగా నిర్ణయించారు. వేలం పాటలో పాల్గొనే వారికి ప్రత్యేక ఐడీ నంబరు కేటాయించనున్నారు. కాగా ప్రభుత్వం వేలం రూ.53.33 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. మిల్లులోపని చేసిన 3, 745 మంది కార్మికలకు గ్రాట్యూటీ డబ్బులు అందజేయనున్నారు. మిల్లు పునరుద్ధరణకు ఐడీబీఐ నుంచి రుణం పొందారు. ఈ రుణం కూడా చెల్లించాల్సి ఉంది.