Share News

kumaram bheem asifabad- ఓటరు సవరణకు ఎస్‌ఐఆర్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:59 PM

ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ దేశ వ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ కార్యక్రమం చేపట్టగా మొదటి దశ మ్యాచింగ్‌ కార్యక్రమం పూర్తయింది. త్వరలోనే ఇంటింటా సర్వేచేసి ఓట్ల సవరణ చేయనున్నారు

kumaram bheem asifabad- ఓటరు సవరణకు ఎస్‌ఐఆర్‌
ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఆర్డీవో లోకేశ్వరావు(ఫైల్‌)

- త్వరలోనే ఇంటింటి సర్వే

- సరైన పత్రాలు చూపకుంటే ఓటు తొలగింపే కాగజ్‌నగర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ దేశ వ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ కార్యక్రమం చేపట్టగా మొదటి దశ మ్యాచింగ్‌ కార్యక్రమం పూర్తయింది. త్వరలోనే ఇంటింటా సర్వేచేసి ఓట్ల సవరణ చేయనున్నారు. జిల్లాలో బీఎల్‌ఓలు త్వరలోనే మ్యాచింగ్‌ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో దానికి కావాల్సిన పత్రాలను సమర్పించని ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. బీహార్‌ రాష్ట్రంలో మాదిరగా తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం పేరిట ఓటర్ల జాబితా చేస్తున్నారు. మొదటి దశలో 2002, 2025 ఓటరు జాబితాను దగ్గరు ఉంచుకొని అందులో ఓటరు మ్యాపింగ్‌ చేపట్టారు. ఇప్పుడు మ్యాపింగ్‌ కాని ఓటర్ల ఇంటి వద్దకు బీఎల్‌ఓలు వచ్చి తమ ఓటు హక్కు ఎలా పొందారో..? వాటికి సంబంధించిన స్థానిక ధ్రువీకరణ పత్రాలు అందజేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2002, 2025 ఓటరు జాబితల్లో ఓటు హక్కు కలిగి ఉంటేనే వారు స్థానికులుగా దేశపౌరులుగా గుర్తించనున్నారు. 2025 ఓటరు జాబితాలో మాత్రమే ఓటు హక్కు ఉంటే ఆ ఓటరు జాబితాలో మాత్రమే ఓటు హక్కు ఎలా పొందారో నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2002లో ఓటు హక్కు ఉండి ఇప్పుడు లేని వారి వివరాలను సేకరించి వారు ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడ ఉంటున్నారు..? అనే వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. చనిపోయినా, ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి ఓట్లు ఉంటే గుర్తించి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2002 ఓటరు జాబితాలో 18 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వయస్సు గల ఓట్లను గుర్తించనున్నారు. 2002 నుంచి 18 ఏళ్లు ఉన్నట్లయితే 2025 నాటికి వారి వయస్సు 43 ఏళ్లు వయస్సు ఉంటుంది. అప్పుడు 38 ఏళ్లు ఉన్నట్లయితే ఆ ఓటరు ఇప్పుడు 61 ఏళ ్ల వయస్సు ఉంటుంది. అలాంటి వారిలో ఎవరైనా చని పోతే వారి ఓట్లను పూర్తిగా తొలగించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. 2002 తర్వాత నమోదైనా ఓటర్లను స్థానికేతరులుగా గుర్తించి వారి పుట్టిన ప్రాంతం, నివాస ప్రాంతంపై ఆరా తీయనున్నారు. పుట్టిన ప్రాంతం, నివాస స్థలం తల్లిదండ్రులు, తాత, ముత్తాతల స్థానికతపై ధ్రువీకరణ పత్రాలున ద్వారా కూడా నిర్ధారణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై తహసీల్దార్‌ మధూకర్‌ను వివరణ కోర గా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 2002, 2025 ఓటరు జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే సర్వేలు త్వరలోనే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 10:59 PM