Singareni Collieries: సింగరేణిలో ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:26 AM
సింగరేణి ఓపెన్‌కా్‌స్ట గనుల్లో భారీ యంత్రాల ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం కల్పించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది...
సీఎండీ బలరాం కీలక నిర్ణయం
కొత్తగూడెం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓపెన్‌కా్‌స్ట గనుల్లో భారీ యంత్రాల ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం కల్పించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. అర్హత ఉన్న మహిళా ఉద్యోగులు సంబంధిత గని మేనేజర్లకు లేదా శాఖాధిపతికి దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. ఈ దరఖాస్తులను జనరల్ మేనేజర్ సీపీపీ (చీఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) నేతృత్వంలోని ఒక కమిటీ పరిశీలిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఈపీ ఆపరేటర్ ట్రెయినీ కేటగిరీ-5లో నియమిస్తారు.