Singareni Workers : జనరల్ అసిస్టెంట్లుగా.. బదిలీ వర్కర్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:17 AM
సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, సర్ఫే్‌సలలో పనిచేస్తూ మస్టర్లు పూర్తి చేసిన 1,258 మందిని జనరల్ అసిస్టెంట్ ..
1,258 మంది క్రమబద్ధీకరణకు సింగరేణి ఓకే
కొత్తగూడెం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, సర్ఫే్‌సలలో పనిచేస్తూ మస్టర్లు పూర్తి చేసిన 1,258 మందిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ-1గా క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పిస్తూ బుధవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 డిసెంబరు 31 లేదా అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు పూర్తిచేసిన వారికి ఈ అవకాశం కల్పించనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. భూగర్భ గనుల్లో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో, సర్ఫే్‌సలో 240 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లను క్రమబద్ధీకరించేందుకు యాజమాన్యం అంగీకరించింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరాం, డైరెక్టర్ పర్సనల్ పోట్రు గౌతమ్‌లతో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.