కుంభమేళాను తలపించేలా రజతోత్సవ వేడుక
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:15 PM
ఈ నెల 27న పోరుగడ్డ వరంగల్ లో నిర్వహించే బీఆర్‌ఎస్ 25 వసంతాల రజతోత్సవ వేడుక మరో కుంభమేళాను తలపించే విధంగా ఉండబోతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బా ల్క సుమన్ తెలిపారు.
అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
మందమర్రి టౌన్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి) : ఈ నెల 27న పోరుగడ్డ వరంగల్ లో నిర్వహించే బీఆర్‌ఎస్ 25 వసంతాల రజతోత్సవ వేడుక మరో కుంభమేళాను తలపించే విధంగా ఉండబోతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బా ల్క సుమన్ తెలిపారు. శనివారం పట్టణంలో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల సంద ర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఇటీవల జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అ నంతరం ఆయన జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ కోల్‌బెల్ట్ రోడ్డు మీదుగా రాష్ర్టీయ రహదారి వరకు కొనసా గింది. అనంతరం ఆయన జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పిం చారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నాయకుడు, పట్టణ ఇన్‌చార్జి కొంగల తిరుప తిరెడ్డి అధ్యక్షత వహించగా నాయకులు డా. రాజారమేష్, మేడి పెల్లి సంపత్, బట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, బోరిగం వెంకటేష్, ఎండి అబ్బాస్, బెల్లం అశోక్, ప ల్లె నర్సింగ్, రవిందర్, సీపెల్లి సాగర్, ముస్తఫా పాల్గొన్నారు.