Share News

పట్టు సాగు రగడ

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:33 PM

మండలంలో పట్టు పురుగుల పెంపకం అటు ఆదివాసీలకు, ఇటు అటవీ అధికారుల మధ్య వివాదానికి తెర లేపింది. అటవీ ప్రాంతంలో పట్టు పురుగులను పెంచవద్దని, పట్టు పురుగుల పెంపకం నిషేధం అంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధించడంతో పట్టుసాగుదారులు ఆందోళన నిర్వహించారు.

పట్టు సాగు రగడ
అటవీ ప్రాంతంలో ధర్నా చేస్తున్న ఆదివాసీలు

-ఆదివాసీలను అడ్డుకున్న అటవీ అధికారులు

-అటవీ ప్రాంతంలో ధర్నా నిర్వహించిన పట్టు సాగుదారులు

కోటపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పట్టు పురుగుల పెంపకం అటు ఆదివాసీలకు, ఇటు అటవీ అధికారుల మధ్య వివాదానికి తెర లేపింది. అటవీ ప్రాంతంలో పట్టు పురుగులను పెంచవద్దని, పట్టు పురుగుల పెంపకం నిషేధం అంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధించడంతో పట్టుసాగుదారులు ఆందోళన నిర్వహించారు. రెండు రోజుల క్రితం పట్టు సాగుదారులను కావర కొత్తపల్లి అటవీ ప్రాంతంలోకి అటవీ అధికారులు రాకుండా అడ్డుకోవడంతో ఇది క్రమ క్రమంగా ఆందో ళనలకు దారి తీసింది. దీంతో రెండు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన పట్టు పురుగుల పెంపకందారులు చెన్నూరుకు వెళ్లి ఎఫ్‌డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అయినా అటవీ అధికారుల్లో మార్పు రాకపోగా శుక్రవారం మరోసారి పట్టు పురుగు పెంపకందారులు ఆందోళన చేపట్టారు. పట్టు పురుగు పెంపకందారులు శుక్రవారం అటవీ ప్రాంతానికి వెళ్లగా అటవీ అధికారులు మరోసారి అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతంలోకి రావద్దని, ఇక్కడ పట్టు పురుగుల పెంపకం నిషేధం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆదివాసీ సంఘం నాయకుడు జేక శేఖర్‌ ఆధ్వర్యంలో పట్టు పురుగు పెంపకం దారులు అటవీ ప్రాంతంలో ధర్నా చేపట్టారు. మండలంలోని రాజారం, కావరకొత్తపల్లి, అర్జునగుట్ట, ఏదులబంధం గ్రామాలకు చెందిన 750 కుటుం బాలు పట్టు పురుగుల పెంపకంపైనే జీవనాధారం సాగిస్తున్నాయని, ఆరు దశాబ్దాలు గా అటవీ ప్రాంతంలోని నల్లమద్ది చెట్లపై పట్టు పురుగుల పెంపకం చేపడుతు న్నా మని, ఇక్కడి పట్టు పరిశ్రమకు రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు ఉందని, ప్రస్తుతం అటవీ అధికారులు అడ్డుకోవడంతో తమపరిస్థితి ఏమిటని బాధిత కుటుంబాల ప్రజలు వాపో యారు. తాము అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం లేదని, గుంట భూమి కూడా అటవీ ప్రాంతం భూమి పొందలేదని, అటవీ ప్రాంతంలో ఉన్న నల్లమద్ది చెట్లపైనే పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నామన్నారు. తాము అడవికి ఎలాంటి హానీ చేకూర్చడం లేదని బాధితులు వాపోయారు. సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వ హించగా ఎఫ్‌ఆర్‌వో సదానందం ఈ ప్రాంతానికి చేరుకుని బాధితులతో చర్చలు జరి పారు. అయినా సఫలం కాకపోగా ఆదివాసీ సంఘం నాయకులను చెన్నూరు అటవీ శాఖ కార్యాలయానికి రావాలని సమస్యలుంటే పరిష్కరించుకుందామని అటవీ అధి కారులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. అటవీ శాఖ పట్టు పురుగుల పెంప కాన్ని అడ్డుకుంటే తాము ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆదివాసీ సంఘం నాయకుడు జేక శేఖర్‌ హెచ్చరించారు.

Updated Date - Oct 03 , 2025 | 10:33 PM