Share News

kumaram bheem asifabad-ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:55 PM

సిర్పూర్‌(టి) మండలంలో బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కళ్యాణ మండలంలో నూతన సర్పంచ్‌లను సన్మానించారు.

kumaram bheem asifabad-ప్రజలకు అందుబాటులో ఉండాలి
సిర్పూర్‌(టి)లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

సిర్పూర్‌(టి), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలో బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కళ్యాణ మండలంలో నూతన సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లానే సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థి గెలుపొందడం అభినం దనీయమన్నారు. సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అచ్చెల్లి సర్పంచ్‌ రాచర్ల రజిత మహేష్‌, సిర్పూ ర్‌(టి) మేజర్‌ పంచాయతీ ఒడ్డెటి నాగమణితో పాటు ఇటిక్యాల పహాడ్‌, పారిగాం, భూపాలపట్నం, లోనవెల్లి, వెంకట్రావుపేట సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లావణ్య, సాయి, విలాస్‌, అశోక్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): ఇటీవల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారిని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయాలని వారికి సూచించారు. అధికారం వచ్చిందని అహకారాన్ని దరి చేరనివ్వకుండా ప్రజలతో మన్ననలు పొందాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిని అలాగే కొనసాగిస్తామన్నారు. ఓడి పోయిన వారు ఎఎవరు కూడా అధైర్యపడవద్దని రాజుల్లో అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఓడిపోయిన వారిని అక్కున చేర్చుకుని లీడర్లుగా తయారు చేస్తామన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాఆ్లడుతూ ప్రజల మధ్య ఉంటూ గారమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అధికారం వచ్చిందని అహంకారాన్ని దరి చేరనివ్వకుండా ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలని సూచించారు. పార్టీలకు అతీతంగా గారమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని అలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఓడి పోయిన వారు అధైర్యపడోద్దని రానున్న రోజుల్లో అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచలు రాంచందర్‌, రుక్మాబాయి, రవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 10:55 PM