Share News

kumaram bheem asifabad- జూనియర్‌ కళాశాలలో వసతులు కరువు

ABN , Publish Date - Oct 29 , 2025 | 10:57 PM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వసతలు లేమితో కొట్టుమిట్టాడు తోంది. దీంతో విద్యార్థుల చదువు కుంటుపడుతోంది. విద్యార్ధులకు విద్యా బుద్దులు నేర్పే కళాశాలలో సౌకర్యాలు కరువయ్యాయి. రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇరుకు గదులు నడుమ విద్యా బోధన సాగుతోంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేక పోవడంతో ఉన్న గదుల్లోనే విద్యార్ధులు సర్దుకుంటున్నారు.

kumaram bheem asifabad- జూనియర్‌ కళాశాలలో వసతులు కరువు
రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- ప్రతిపాదనలు పంపినా పట్టింపే లేని వైనం

రెబ్బెన, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వసతలు లేమితో కొట్టుమిట్టాడు తోంది. దీంతో విద్యార్థుల చదువు కుంటుపడుతోంది. విద్యార్ధులకు విద్యా బుద్దులు నేర్పే కళాశాలలో సౌకర్యాలు కరువయ్యాయి. రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇరుకు గదులు నడుమ విద్యా బోధన సాగుతోంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేక పోవడంతో ఉన్న గదుల్లోనే విద్యార్ధులు సర్దుకుంటున్నారు. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇంత వరకు ఈ సమస్య పరిష్కరించటం లేదని విద్యార్ధులు వాపోతున్నారు. అలాగే ఇరుకు గదులతో సమస్య ఉంటే ఇందులోనే ల్యాబ్‌లు సైతం నిర్వహించడంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థినిలు తెలిపారు.

సరిపడా గదులు లేక..

రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 755 మంది విద్యార్ధులు ఉన్నారు. విద్యార్థుల ఇంత మంది ఉన్నా 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 340, రెండో సంవత్సరంలో 415 మంది విద్యార్థులు చదువుతున్నారు. జనరల్‌ గ్రూపు విద్యార్ధులకు నాలుగు గదులు కేటాయించగా,ఒకేషనల్‌ విద్యార్ధులకు ఆరు గదులను కేటాయించారు. మరోగది ప్రిన్సిపాల్‌, స్టాఫ్‌ రూంలకు కేటాయించి, మిగిలిన మూడు గదుల్లోనే ప్రథమ, ద్వితీయా సంవత్సరం విద్యార్థులకు ప్రస్తుతం తరగతి గదులను బోధిస్తున్నారు. గదులు సరిగ్గా లేవంటే ఇందులో ల్యాబ్‌లను ఏర్పాటు చేశార. ఒకేషనల్‌ గ్రూపు కోసం ఆరు గదులను నిర్మించగా ఒక్కొ గదిలో నాలుగేసి సెక్షన్లు నిర్వహించడంతో పూర్తిగా దయనీయ పరిస్థితులు చదువులను విద్యార్ధులు చదువుతున్నారు. కళాశాలో విద్యార్ధుల సంఖ్యకు సరిపడా సౌకర్యాలు మెరుగుపడాలంటే కనీసం మరో 26 గదులను ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిలో జనరల్‌ విద్యార్థుల ల్యాబ్‌ కోసం ఆరు గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌ కోసం ఒకటి, స్టాప్‌ కోసం ఒకటి గది అవరం ఉంది. అలాగే ఓకేషనల్‌ విద్యార్థుల తరగతుల నిర్వహణ కోసం 8 అవసరం ఉండగా, ల్యాబ్‌ల ఏర్పాటు కోసం మరో ఏడు గదులు అదనంగా నిర్మించాల్సి ఉంది. అయితే అదనపు తరగతి గదుల కోసం కళాశాల సిబ్బంది ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తున్నా కూడా ఇంత వరకు స్పందన రావడం లేదు. మండల కేంద్రంలో స్థలం అందుబాటులో లేక పోవటంతో కళాశాలను ఇందిరానగర్‌ సమీపంలో నిర్మించారు. అయితే కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేక పోవ డంతో ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. సీజీటీలకు చెందిన నాలుగు సెక్షన్లను ఒకే గదిలో నడుపుతున్నారు. ఎంఎల్‌టీ మొదటి, ద్వితీయ సంవత్సరం తరగతుల కోసం ఒక గదిని, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఆటోమోబైల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం మరో గదిని, ఆర్‌ఎం మొదటి, ద్వితీయా సంవత్సరం విద్యార్థుల కోసం ఒక గదిని, కంప్యూటర్‌ సైన్స్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం కేటాయించారు. తరగతి గదుల్లో ల్యాబ్‌లు నిర్వహిస్తుండటంతోఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని నిధులు కేటాయించి అదనపు గదులను నిర్మించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 10:57 PM