Share News

kumaram bheem asifabad- ష్‌.. గప్‌చుప్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:12 PM

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్ని మూగబోయాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ గత నెల 30నుంచి ఈ నెల 2వరకు కొనసాగింది. ఆపై నామినేషన్ల స్కూృట్నీ, ఉపసంహరణలు, తుదిజాబితా ప్రకటన పూర్తయిం ది. సరిగ్గా ఆరు రోజుల పాటు గ్రామాల్లో ఇంటిం టికి తిరిగి ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, వారి బందుమిత్రులు మద్దతు ఇచ్చిన ప్రధాన పార్టీల నాయకులు చివరి మూడు రోజులు గెలుపు తమ భుజస్కందాలపై వేసుకొని ముఖ్యగ్రామాలు తిరి గిన రాజకీయ పెద్దలు శుక్రవారం సాయంత్రంతో ప్రచారాలు ఆపేశారు.

kumaram bheem asifabad- ష్‌.. గప్‌చుప్‌
లోగో

- ఆరు మండలాల్లో వైన్‌ షాపుల సీజ్‌

- రేపు పోలింగ్‌

- పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు

బెజ్జూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్ని మూగబోయాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ గత నెల 30నుంచి ఈ నెల 2వరకు కొనసాగింది. ఆపై నామినేషన్ల స్కూృట్నీ, ఉపసంహరణలు, తుదిజాబితా ప్రకటన పూర్తయిం ది. సరిగ్గా ఆరు రోజుల పాటు గ్రామాల్లో ఇంటిం టికి తిరిగి ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, వారి బందుమిత్రులు మద్దతు ఇచ్చిన ప్రధాన పార్టీల నాయకులు చివరి మూడు రోజులు గెలుపు తమ భుజస్కందాలపై వేసుకొని ముఖ్యగ్రామాలు తిరి గిన రాజకీయ పెద్దలు శుక్రవారం సాయంత్రంతో ప్రచారాలు ఆపేశారు. ఈనెల 14న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా, అంతకుముందు మిగిలిన ఒకేఒక చివరి రోజు ప్రధాన రాజకీయ పార్టీలు తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థులకు సంబంధించి పోల్‌మేనేజ్‌మెంట్‌ ప్రక్రియను విజయవంతంగా ముగించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం ఆరు మండలాల్లో 113 గ్రామ పంచాయతీలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా 112పంచాయతీలకు ఎన్ని కలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో మొత్తం 992వార్డులకు 143వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 12స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 837వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తు న్నారు. రెండో విడతలో బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, సర్పంచ్‌ స్థానాలకు 425మంది, వార్డు స్థానాలకు 2,1 40మంది బరిలో ఉన్నారు.

ఓటర్లను ఆకట్టుకునేలా..

జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న అన్ని గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు గా పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రధాన అస్ర్తాలైన డబ్బు, మందు, విందు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఆయా మండలాల్లో ఎన్నికల ప్రచారం ముగిసిన క్షణం నుంచే ఓటుకు నోటిచ్చే కీలక ప్రక్రియ అమలుకు బూత్‌లు, వార్డుల వారిగా జాబితాలను సిద్ధం చేసు కొని వీటికనుగుణంగా తమతమ పార్టీల అభిమా నులు, వారి కుటుంబాలకు అందజేసే కార్యక్రమం గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసేందుకు ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు. ప్రధాన సర్పంచ్‌ అభ్యర్థులు రూ.200నుంచి రూ.500వరకు ఇస్తుండగా, పెద్ద పంచాయతీల్లో ఒకరిద్దరూ రూ.500నుంచి రూ.1000వరకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరిగే మండ లాల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసే సమయానికి కొంచెం ముందు గానే మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ అధికారులు సిబ్బందితో సీల్‌ వేయించారు. తిరిగి 48గంటల అనంతరం ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాక తిరిగి తెరుచుకునే వీలుంటుందని చెబుతు న్నారు. కాగా ముందు జాగ్రత్తలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు చీప్‌లిక్కర్‌ బాటి ళ్లను ముందే రహస్య ప్రాం తాలకు తరలించుకున్నారు. ఇదే అదునుగా బెల్టు షాపుల్లోనూ చీప్‌లిక్కర్‌ మద్యం రేట్లకు రెక్కలొ చ్చాయి. బీర్ల ధరలు సైతం రెండింతలు పెరిగాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికే షన్‌తోనే మద్యం, విందులు నడుస్తుండగా రెండో విడత ప్రచారం ముగిసిపోవడంతో అభ్యర్థులు మద్యం, నగదు జాతర మొదలుపెట్టారు. ఓటుకు నోటుగా భావిస్తూ అభ్యర్థులు గెలుపు కోసం ఖర్చుకు వెనకాడడం లేదు. సర్పంచ్‌ అభ్యర్థులు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు, వార్డు అభ్యర్థులు రూ.500 నుంచి రూ.వెయ్యి వర కు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చర్చించు కుంటున్నారు. ఇంటింటికి మద్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దూర ప్రాంతాల్లో ఉ న్న ఓటర్లకు రవాణా ఖర్చులతో పాటు నజరానాలు ఇచ్చి రప్పించుకుంటున్నారు. దీంతో ఉపాధి, ఉద్యో గం, చదువుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇళ్లకు చేరడం తో పల్లెల్లో కుటుంబ సందడి కూడా కనిపిస్తోంది.

- అభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌

పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. తొలి విడతలు పోటీపడుతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఓటు అనుకూలిస్తుందా లేదా అనే టెన్షన్‌ మాత్రం అభ్యర్థులను వీడడం లేదు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్ల చుట్టూ పరుగులు తీస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో 24 గంటల్లో అభ్యర్థుల భవిత వ్యం తెలిపోతుంది. ఓటర్లలోను గెలుపోటములపై ఆసక్తి ఏర్పడింది.

Updated Date - Dec 12 , 2025 | 10:12 PM