Share News

Drone supplies: నీటి మధ్యే 10 రోజులు సావాసం

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:34 AM

వారు ముగ్గురు గొర్రెల కాపరులు.. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి వాసులు బద్దెల వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్య, సిగ ...

Drone supplies: నీటి మధ్యే 10 రోజులు సావాసం

  • డిండి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లు

  • డ్రోన్‌ సాయంతో నిత్యావసర సరుకుల అందజేత

  • నల్లగొండ జిల్లా డిండిలో ఘటన

డిండి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): వారు ముగ్గురు గొర్రెల కాపరులు.. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి వాసులు బద్దెల వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్య, సిగ వెంకటయ్య 10 రోజుల క్రితం 300 గొర్రెలు, మేకలను మేపుకు రావడానికి అడవికెళ్లారు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో డిండి (దుందుభి) వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంలో దాని మధ్యలో ఉన్న మట్టి దిబ్బపై చిక్కుకున్నారు. చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయిన ముగ్గురు జీవాల కాపర్లు వెంట తీసుకెళ్లిన సరుకులైపోవడంతో గ్రామస్తులు డిండి తహసీల్దార్‌కు సమాచారమిచ్చారు. దీనిపై స్పందించిన దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, తహసీల్దార్‌ హనుమంతు శ్రీనివాస్‌ గౌడ్‌, ఎస్‌ఐ బాలకృష్ణ తదితరులు డిండి వాగు దగ్గరకు చేరుకున్నారు. డ్రోన్‌ సాయంతో గొర్రెల కాపర్లకు నిత్యావసర సరుకులు పంపారు.

Updated Date - Nov 04 , 2025 | 02:34 AM