Share News

Bomb Threat Investigated: శంషాబాద్‌ విమానాశ్రయంలో 4.3 కోట్ల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:10 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 4.3 కిలోల గంజాయిని డీఆర్‌ఐ డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు....

Bomb Threat Investigated: శంషాబాద్‌ విమానాశ్రయంలో 4.3 కోట్ల గంజాయి పట్టివేత

  • ఓ ప్రయాణికుడి అరెస్టు..

  • మరో ఘటనలో 1.4 కోట్ల విలువైన ఎలకా్ట్రనిక్‌ పరికరాల స్వాధీనం

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 4.3 కిలోల గంజాయిని (డీఆర్‌ఐ) డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి సలీం అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. డీఆర్‌ఐ అధికారులు అతడి బ్యాగులు తనిఖీ చేయగా 4.3 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.4.3 కోట్లు ఉంటుందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటు ఎలకా్ట్రనిక్‌ వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్న మరో ఇద్దరు నిందితులను కూడా కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. సూర్యప్రకాశ్‌రాజు, మహ్మద్‌ జహంగీర్‌ అనే ఇద్దరు ప్రయాణికులు మంగళవారం అర్ధరాత్రి అబుదాబి ఈవై 358 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారి బ్యాగులు తనిఖీ చేయగా.. నిషేధిత 8 డీజేఐ డ్రోన్లు, 65 ఐఫోన్లు, 2 ల్యాప్‌టా్‌పలు, 20 యాపిల్‌ వాచ్‌లు, తదితర ఎలకా్ట్రనిక్‌ వస్తువులున్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.1.4కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్‌ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ బెదిరింపు మెయిల్‌ రాగా.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించి అంతా ఉత్తిదేనని తేల్చాయి. ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్‌ కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గుర్తు తెలియని దుండగులు గురుగ్రామ్‌లోని ఇండిగో కాల్‌ సెంటర్‌కు బెదిరింపు మెయిల్‌ పంపించారు. అందులో శంషాబాద్‌ను కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన బలగాలె భద్రతను కట్టుదిట్టం చేశాయి. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు.

Updated Date - Nov 13 , 2025 | 05:10 AM