Shamirpet Police Station: ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:03 AM
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌క అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్‌లలో శామిర్‌పేట స్టేషన్‌కు....
జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌క అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్‌లలో శామిర్‌పేట స్టేషన్‌కు ఏడో ర్యాంకు దక్కింది. రాష్ట్రస్థాయిలో ఈ పోలీస్ స్టేషన్ నంబర్ వన్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల పనితీరు కోసం కేంద్ర హోశాఖ కీలక అంశాలను పరిగణనలోకి తీసుకొంది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు గడువులోపల పరిష్కారాలు చూపడం, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్‌ఎస్ పని, సిబ్బంది నైపుణ్యాలు వంటి అంశాలు వంటి అంశాలను పరిశీలించి టాప్ టెన్ పోలీస్ స్టేషన్లతో కూడిన జాబితాను ప్రకటించింది. కాగా కేంద్రప్రభుత్వం నుంచి శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కడం, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు స్టేషన్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.