Share News

Shabari Express: సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా శబరి ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:34 AM

సికింద్రాబాద్‌-త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ వేగాన్ని పెంచి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా మార్చేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది.

Shabari Express: సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా శబరి ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌-త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ వేగాన్ని పెంచి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా మార్చేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ మార్పును సెప్టెంబరు 29వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం శబరి ఎక్స్‌ప్రెస్‌ 17229/17230 నంబర్లతో నడుస్తుండగా.. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సకు కొత్తగా 20629/20630 నంబర్లను కేటాయించారు.


ఈ రైలు వేగాన్ని పెంచడంతోపాటు దాని వేళల్లోనూ మార్పులు చేశారు. ప్రస్తుతం శబరి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరుతుండగా.. సెప్టెంబరు 29నుంచి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరనుంది.

Updated Date - Jul 27 , 2025 | 04:34 AM