Share News

Cold Wave: కొనసాగుతోన్న చలి తీవ్రత

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:48 AM

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో బుధవారం ఉదయం...

Cold Wave: కొనసాగుతోన్న చలి తీవ్రత

  • కోహీర్‌లో 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో బుధవారం ఉదయం 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రంలోనే ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రత. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి, సిర్పూర్‌(యు) మండలాల్లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 6.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.6, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 6.9, సిద్ధిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 7.4, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 7.6, బోరజ్‌, ఆదిలాబాద్‌ రూరల్‌లో 7.9, మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలోనూ చలి తీవ్రత పెరిగింది. జిల్లాలోని గుండాలలో బుధవారం 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ జిల్లా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 12.6 డిగ్రీలుగా నమోదయ్యింది. భద్రాద్రి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఖమ్మం జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం చలి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Dec 11 , 2025 | 04:48 AM