Chanchalguda Jail: చంచల్‌గూడలో విచారణ ఖైదీలను హింసించారు
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:48 AM
చంచల్‌గూడ కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న ఏడుగురిని జైలు అధికారులు తీవ్రంగా కొట్టారంటూ పౌర హక్కుల సంఘం కన్వీనర్ గుంటి...
ఏడుగురిని తీవ్రంగా కొట్టారు: పౌరహక్కుల సంఘం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న ఏడుగురిని జైలు అధికారులు తీవ్రంగా కొట్టారంటూ పౌర హక్కుల సంఘం కన్వీనర్ గుంటి రవి ఆరోపించారు. మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఖైదీలను శనివారం డిప్యూటీ జైలర్ లక్ష్మణ్ బాబు, జవాన్ సందీ్‌పలు కొట్టారని, అనంతరం వారిని వేర్వేరు సెల్‌లలో నిర్బంధించారని పేర్కొన్నారు. అధికారుల హింసాకాండను నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు సోమవారం రవి ఓ ప్రకటనలో తెలిపారు. ఏడుగురు ఖైదీలు గిరిజనులు కాగా, వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.