Share News

అధిక వడ్డీ ఆశ చూపి ఏడుకోట్లు స్వాహా

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:20 PM

అధిక వడ్డీ ఆశచూపి దాదాపుఏడు కోట్లు దండుకొని పరారైన దుండగులను పట్టుకొని రి మాండ్‌ చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి బుధవారం తెలిపారు.

అధిక వడ్డీ ఆశ చూపి ఏడుకోట్లు స్వాహా

- గ్రోల్యాండ్‌ కంపెనీ పేరుతో అండమాన్‌కు చెందినవారి మోసం

- నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్‌

నాగర్‌కర్నూల్‌క్రైం, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యో తి) : అధిక వడ్డీ ఆశచూపి దాదాపుఏడు కోట్లు దండుకొని పరారైన దుండగులను పట్టుకొని రి మాండ్‌ చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డు ఆర్మీ కొండ్రాళ్ల మాసయ్యకు హైదరాబాద్‌లో అండమాన్‌కు చెందిన వ్యక్తులు ఆర్‌.రోహన్‌, టి.ఆది, రాము, టి.ఆలీలు పరిచ యమయ్యారు. గ్రోల్యాండ్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే 25శాతం లాభం వస్తుందని మాయమా టలు చెప్పి నమ్మించారు. కొండ్రాళ్ల మాసయ్య తో పాటు మరో 50 మందితో సుమారు రూ. 7 కోట్లు కంపెనీలో డిపాజిట్‌ చేయించి పరార య్యారు. ఈ సంఘటనపై కొండ్రాళ్ల మాసయ్య 2025 మార్చి 7వ తేదీన నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ప్రత్యేక పోలీసు బృందాన్ని డెహ్రాడూన్‌కు పం పించి నలుగురు నిందితులను అక్కడ పట్టుకొ నివచ్చి మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని సీఐ తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 11:20 PM