గంజాయి రవాణా.. ఏడుగురు అరెస్టు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:16 AM
నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు
నకిరేకల్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నల్లగొండకు చెందిన సమీర్, బోరింగ్ సంపత్‌కుమార్, నకిరేకల్‌కు చెందిన ఎన్నమల్ల సాయిరాం, ముక్కాముల అఖిల్, పల్లెబోయిన శివ, శాలిగౌరారానికి చెందిన బండారి వినయ్, చివ్వెంల మండలానికి చెందిన కుంచెం నవీన్‌తో పాటు మరో బాల నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నకిరేకల్, సూ ర్యాపేట పట్టణాల్లో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని, వీరి వద్ద నుంచి 290గ్రాముల గంజాయి, ఏడు సెల్‌ఫోన్‌లు, ఒక స్కూటీ, ఆటోను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎస్‌ఐలు బి. లచ్చిరెడ్డి, జి. కృష్ణాచారి, పోలీస్ సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కె. జనార్ధన్, బి. మదుకర్, ఎం. శ్రీనివాస్, ముజీద్, వి. సురేష్, డి. శీకాంత్, ఎం. నాగార్జున తదితరులు పాల్గొన్నారు.