Share News

kumaram bheem asifabad- గిరిజనులకు సేవలు అభినందనీయం

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:40 PM

జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం మాలన్‌గొంది గ్రామంలో గురువారం నెస్టిల్‌ స్వచ్ఛంద సంస్థ వరద ప్రభావిత గ్రామాల్లో 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, నెస్టిల్‌ ఇండియా లిమిటెడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- గిరిజనులకు సేవలు అభినందనీయం
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం మాలన్‌గొంది గ్రామంలో గురువారం నెస్టిల్‌ స్వచ్ఛంద సంస్థ వరద ప్రభావిత గ్రామాల్లో 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, నెస్టిల్‌ ఇండియా లిమిటెడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరద ప్రభావిత గ్రామాలలో నిరాశ్రయులకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించారని అన్నారు. మారు మూల గిరిజన గారమాలలో కూడా ముందుకు వచ్చి సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతకు ముందు గ్రామస్థులు అధికారులకు గుస్సాడీ నృత్యంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నెస్టిల్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరే్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి జిల్లా పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, రవాణా, తూనికలు, కొలతలు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వానాకాలం 20225-26 సీజన్‌ వరి ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్ల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్డాఉతూ వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా చేట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో అంచనా 44 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, రైతులు ధాన్యాన్ని పూర్తిగా అరబెట్టిన తరువాతే నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, తూకం యంత్రాలు, ట్యాబ్‌లు, టార్పాలీన్‌ కవర్లు సిద్దంగా ఉంచాలని, కొనుగోలు చేసి ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్‌ మిల్లులకు తరలించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంఆన్రికి మండల స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని, ఇతర రాష్ట్రాల ధ్యాన్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ వెలుతురు ఇతర ఏరాపటు చేయాలని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, గ్రామీణాభివృద్ధి అదికారి దత్తారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్షిమ, జిల్లా మార్కెటింగ్‌ అధికరి అశ్వక్‌ అహ్మద్‌, వ్యవసాయ, రవాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 10:40 PM