Share News

ప్రజలకు చేసే సేవలే గుర్తింపు తెస్తాయి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:47 PM

ప్రజలకు చేసే సేవలే సర్పంచులకు మంచి గు ర్తింపును తీసుకువస్తాయని దేవాపూర్‌ అదా ని సిమెంట్‌ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావు అన్నారు. సోమవా రం ధర్మారావుపేటలో కొత్తగా ఎన్నికైన కాం గ్రెస్‌ (ప్రేమ్‌సాగర్‌రావు) సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ప్రజలకు చేసే సేవలే గుర్తింపు తెస్తాయి

కాసిపేట, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు చేసే సేవలే సర్పంచులకు మంచి గు ర్తింపును తీసుకువస్తాయని దేవాపూర్‌ అదా ని సిమెంట్‌ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావు అన్నారు. సోమవా రం ధర్మారావుపేటలో కొత్తగా ఎన్నికైన కాం గ్రెస్‌ (ప్రేమ్‌సాగర్‌రావు) సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకతీతంగా ప్రజల కు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజల న మ్మకాన్ని కోల్పోయినప్పుడు ఎంత పెద్దనాయ కుడ్ని అయినా ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ప్ర జల విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకంతో పని చేయాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభు త్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా విని యోగించి ప్రజలకు జవాబుదారులుగా ఉండా లన్నారు. పంచాయతీలను అభివృద్ధి చేసి ఆద ర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. ఎన్నిక ల్లో గెలుపోటములు సహజమని, ఓటమి పాలైన సర్పంచు అభ్యర్ధులు ఓటమి నుంచి గు ణపాఠం నేర్చుకుని విజయం వైపు దూసుకు వె ళ్లాలన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పం పిణీ సంస్కృతిని మార్చేందుకు అందరు సహక రించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నె రవేర్చేందుకు సర్పంచులు కృషి చేయాలన్నా రు. ఈ సందర్భంగా నూతన సర్పంచులను శా లువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స భ అద్యక్షుడు వేముల కృష్ణ, సర్పంచులు రాం దాస్‌, రఘు, మహేందర్‌, కళావతి, సహస్ర, రా ధ, మాణిక్య, శైలజ, నాయకులు తిరుపతి, మే రుగు శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:47 PM