kumaram bheem asifabad- విధులతో పాటు సేవా కార్యక్రమాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:25 PM
విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఎఫ్‌డీవో దేవిదాస్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖదేవ్‌తో కలిసి రక్తదానం చేశారు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఎఫ్‌డీవో దేవిదాస్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖదేవ్‌తో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖలో విధి నిర్వహణ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. అన్ని సవాళ్లను కూడా అధిగమిస్తూ విధి నిర్వహణ చేయడంతో పాటు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దీనిలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని అలా చేస్తే ఎటువంటి వ్యాధులు ధరి చేరవన్నారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణధానంగా ఉపయోగపడుతుందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వినియోగించడం హర్షిందగ్గర విషయం అన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేయడానికి ఆహార్నిశలు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. ఈ శిబిరంలో మొత్తం 62 యూనిట్లు సేకరించగా దీనిలో అటవీ శాఖ సిబ్బంది 54 మంది కాగా 8 మంది సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని వైద్యుడు అజ్మత్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ రేంజ్ అధికారులు గోవింద్‌చంద్ సర్దార్, అనీల్‌కుమార్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, డిప్యూటీ రేంజర్ యోగేష్, ఝాన్సీరాణి, చంద్రమోహన్, విజయ్, ప్రకాష్, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.