Share News

అమాయకులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:49 PM

అమా యకులపై రాజకీయ కక్షతో కేసులు బనాయిస్తే భవి ష్యత్‌ లో తీవ్ర పరిణమాలు ఎదుర్కొంటారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు నడిపెల్లి విజిత్‌రావు, పట్టణాధ్యక్షుడు గాదె సత్యంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

అమాయకులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

-మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : అమా యకులపై రాజకీయ కక్షతో కేసులు బనాయిస్తే భవి ష్యత్‌ లో తీవ్ర పరిణమాలు ఎదుర్కొంటారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు నడిపెల్లి విజిత్‌రావు, పట్టణాధ్యక్షుడు గాదె సత్యంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా అమాయకులపై పో లీసులు దాడి చేస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నార న్నారు. బీఆర్‌ఎస్‌ పక్షాన నిరసన, ధర్నా చేస్తే మాత్రం వెం టనే వచ్చి అరెస్టు చేస్తారని ఇదెక్కడి న్యాయం అన్నారు. అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడానికి వెళితే కనీ సం కేసు కూడా తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోం దన్నారు. గతంలో తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవర్ని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు లేవన్నారు. మండ లంలోని రాపల్లి గ్రామంలో దళితుడైన ప్రవీణ్‌, నితీష్‌లపై సాయికుమార్‌అనే వ్యక్తి ఇతర కాంగ్రెస్‌పార్టీ నాయకులు దాడి చేశారని, తిరిగి అతనిపైనే ఫిర్యాదు చేయగా అమా యకుడైన ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఆయన తల్లిదండ్రులు గ్రామ పెద్దమనుషులకు చెబితే పె ద్దమను షులపై కూడా కేసు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాష్టికం ఎన్నో రోజులు కొనసాగదని, ప్రజలపై జులుం చెలాయిస్తే సహించేది లేదన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే కోర్టులో తేల్చుకుంటామన్నారు. అనంతరం బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బెదిరింపు రాజకీయాలతో అమాయకుల ఇండ్లపై పోలీ సులు, రౌడీలు దాడి చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగి స్తున్నారన్నారు. పిటీషన్‌ ఇవ్వకుముందే అర్ధరాత్రులు బీఆర్‌ ఎస్‌ నాయకుల ఇళ్లపై సోదాలు, దాడులు చేయడం సరైం ది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సు బ్బన్న, గోగుల రవీందర్‌రెడ్డి, వంగ తిరుపతి, నరేష్‌, అత్తి సరోజ, రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 10:49 PM