Share News

kumaram bheem asifabad-ముగిసిన సెపక్‌ తక్రా పోటీలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:10 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రా అండర్‌-14, అండర్‌-17 పోటీలు ఆదివారం ముగిశాయి. జూనియర్‌ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు వరంగల్‌తో పోటీ పడి విజయం సాధించింది.

kumaram bheem asifabad-ముగిసిన సెపక్‌ తక్రా పోటీలు
బాలికల విభాగంలో విజయం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సెపక్‌ తక్రా జట్టు

రెబ్బెన, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రా అండర్‌-14, అండర్‌-17 పోటీలు ఆదివారం ముగిశాయి. జూనియర్‌ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు వరంగల్‌తో పోటీ పడి విజయం సాధించింది. జూనియర్‌ బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు గెలిచింది. సబ్‌ జూనియర్‌ విభాగంలో మహబూబ్‌నగర్‌ బాలుర జట్టు గెలుపొందింది. విజేతలకు బెల్లంపల్లి ఇన్‌చార్జి జీఎం నరేందర్‌, ఎస్సై వెంకటకృష్ణలు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రా బాలబాలికల పోటీలు నిర్వహించడం శుభపరిణామని చెప్పారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన వారు కూడా మళ్లీ గెలువాలని, ఇక్కడ ఎంపికైన వారు జాతీయ స్థాయిలో కప్‌ తేవాలని, క్రమ శిక్షణతో ఆడి గెలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెపక్‌ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్‌ రెడ్డి, జారీపుద్దీన్‌ఖాన్‌, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తిరుపతి, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రమేష్‌, ఆర్‌.నారాయణరావు, బాపిరెడ్డి, వీరన్న, ఇంజనీరు ఉజ్వల్‌ బెహారా, పర్సనల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఐఎన్‌టీయూసీ నాయ కుడు ప్రకాష్‌, ఏఐటీయూసీ నాయకుడు కిరణ్‌, టీబీజీకేఎస్‌ నాయకుడు షార్ప్‌ స్టార్‌ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:10 PM